Sanjay Raut | బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య (Kirit Somaiya) భార్య మేధా సోమయ్య (Medha Somaiya) దాఖలు చేసిన పరువు నష్టం కేసు (defamation case)లో ముంబై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)కు జైలు శిక్ష విధించింది. సెక్షన్ 500 కింద సంజయ్ రౌత్‌ను దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు (Mumbai court) ఆయనకు 15 రోజుల సాధారణ జైలు శిక్ష (imprisonment) విధించింది. అంతేకాదు, రూ.25 వేల జరిమానా కూడా వేసింది.
కాగా, కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. అయితే, ముంబై శివారులోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అంతకు ముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే మేధా సోమయ్య 2022 ఏప్రిల్‌లో సంజయ్ రౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతోపాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
Also Read..
Joe Biden | వెల్కమ్ టు వాషింగ్టన్.. న్యూయార్క్‌లో మరోసారి తడబడ్డ జో బైడెన్..! VIDEO
Manu Bhaker | ఒలింపిక్స్ పిస్టల్ ధర రూ.కోటి..?.. మను బాకర్ స్పందన ఇదే
Atishi | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత