Manu Bhaker | క్రీడా సంచలనం మను బాకర్ (Manu Bhaker) పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ఈ స్టార్ షూటర్ (star shooter) ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలతో మెరిసి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకుంది. ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గానూ రికార్డు సృష్టించింది. ఇక అప్పటి నుంచి ఆమె క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో చర్చంతా ఆమె గురించే. ఆమె బ్రాండ్ వ్యాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే సమయంలో ఆమెపై నెగెటివ్ కామెంట్స్, రూమర్స్ పెరిగిపోయాయి.
భారత గోల్డెన్ బాయ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో మను ప్రేమలో ఉందంటూ గతంలో తెగ రూమర్స్ వచ్చాయి. అయితే, వాటిని ఆమె కొట్టిపోరేశారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా మెడల్స్ తీసుకెళ్తుండటం పట్ల నెటిజన్లు ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ నెట్టింట కామెంట్లు చేశారు. ఆ అవసరం ఏముందంటూ..? ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు మను బాకర్దీటుగానే బదులిచ్చింది. ఇప్పుడు ఆమె పిస్టల్ (Pistol) హాట్ టాపిక్‌గా మారింది. మనూ వాడే పిస్టల్ ధరపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. దాని ఖరీదు రూ.కోటి వరకూ ఉంటుందని కొందరు చెబుతుండగా.. అంతకంటే ఎక్కువే ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై మను బాకర్ స్పందించారు. అంత ధర ఉండదంటూ క్లారిటీ ఇచ్చారు.
కోట్ల రూపాయలా..? అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అది రూ.1.5 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకూ ఉండొచ్చని వెల్లడించారు. అది కూడా ఒకేసారి పెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ధరల్లో కొంచెం అటుఇటూ తేడాగా ఉంటుందని తెలిపారు. మోడల్‌ను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుందని వివరణ ఇచ్చారు. కొత్తదైతే ఒక ధర, పాతదైతే మరొక ధర ఉంటుందన్నారు. క్రీడల్లో ఓ స్టేజ్‌కు వచ్చాక.. కొన్ని సంస్థలు పిస్టళ్లను ఉచితంగా కూడా ఇస్తాయని మను వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Atishi | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత
Senthil Balaji | సెంథిల్ బాలాజీకి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Actor Siddique | పరారీలో మలమాళ నటుడు సిద్ధిఖీ.. పోలీసుల గాలింపు