Senthil Balaji | తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)కి భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court).. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి రెండు సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాలి, సాక్షులను తారుమారు చేయరాదు, పాస్‌పోర్టును అప్పగించాలి వంటి షరతులతో బెయిల్ ఇచ్చింది. సుప్రీం తీర్పుతో దాదాపు 15 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
కాగా, గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డబ్బుకు ఉద్యోగా కుంభకోణం (Cash For Jobs Case) కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ తన మంత్రివర్గంలోనే కొనసాగించారు. అయితే ఏ శాఖను కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Also Read..
Actor Siddique | పరారీలో మలమాళ నటుడు సిద్ధిఖీ.. పోలీసుల గాలింపు
Hindu Temple | అమెరికాలో మరో ఆలయంపై దాడి.. హిందూస్ గో బ్యాక్ అంటూ రాతలు
Mumbai | ముంబైలో వర్ష బీభత్సం.. నేడు విద్యా సంస్థలకు సెలవు