Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో వర్ష బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి (Heavy Rain) నగరం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ వర్షం కారణంగా విమాన, రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. స్పైస్‌జెట్, విస్తారా సహా పలు విమానాలను అధికారులు దారి మళ్లించగా.. మరికొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చింది. గురువారం ఉదయానికి వరద ప్రభావం తగ్గడంతో ఆయా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు (schools shut).
బుధవారం సాయంత్రం కేవలం 5 గంటల వ్యవధిలోనే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సబర్బన్ అంధేరిలో భారీ వర్షం కారణంగా వరద ప్రవాహానికి ఓ మహిళ కొట్టుకుపోయింది. ఇక తూర్పు శివారు ప్రాంతాల్లో ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల మధ్య అత్యధిక సగటు వర్షపాతం 169.85 మిల్లీ.మీ నమోదైంది. ఆ తర్వాత తూర్పు శివారు ప్రాంతాల్లో 169.85 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 104.17 మి.మీ వర్షం కురిసింది. తూర్పు శివారులోని మన్ఖుర్డ్ ప్రాంతంలో అత్యధికంగా 276 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భాండప్లో 275 మి.మీటర్లు, పోవై ప్రాంతంలో 274 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read..
Hindu Temple | అమెరికాలో మరో ఆలయంపై దాడి.. హిందూస్ గో బ్యాక్ అంటూ రాతలు
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Governor Jishnu Dev Varma | తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ