Atishi | ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi ) సోమవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ (Z Security) భద్రతను కేటాయించారు. సీఎం కాన్వాయ్‌లో ఒక పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రతను కల్పించనున్నట్లు సదరు అధికారులు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం.. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రతకు అర్హులు. ఇందుకోసం 22 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తారు. జెడ్ కేటగిరీలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతోపాటు ఆప్ నేతలు గోపాల్‌రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్, అహ్లావత్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిశీ ఢిల్లీకి ఎనిమిదో ముఖ్యమంత్రి కాగా, అత్యంత పిన్న వయస్కురాలైన సీఎంగా ఆమె రికార్డులకెక్కారు. అలాగే, ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన మూడో మహిళగానూ మరో ఘనత సాధించారు.
కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా..!
సోమవారం ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ, కేజ్రీవాల్ వాడిన కుర్చీని కాకుండా మరో కుర్చీ వేసుకొని విధులు నిర్వర్తించారు. రామాయణంలో భరతుడిలా నాలుగు నెలలపాటు ఢిల్లీకి సీఎంగా ఉంటానని ఆమె అన్నారు. అయితే అతిశీ వేరే కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని, సీఎం స్థాయిని అవమానపర్చారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read..
Senthil Balaji | సెంథిల్ బాలాజీకి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Actor Siddique | పరారీలో మలమాళ నటుడు సిద్ధిఖీ.. పోలీసుల గాలింపు
Hindu Temple | అమెరికాలో మరో ఆలయంపై దాడి.. హిందూస్ గో బ్యాక్ అంటూ రాతలు