హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): సింగూర్ డ్యామ్ భద్రతకు ప్రభు త్వం పటిష్ట చర్యలు చేపడుతున్నదని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించి పనులను పూర్తిస్థాయి లో సమీక్షిస్తానని ప్రకటించారు. సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహతో కలిసి ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడు తూ జంటనగరాలకు తాగునీటిని, పరిసర రైతులకు సాగునీటిని అందిస్తున్న సింగూ ర్ ప్రాజెక్టు పరిరక్షణ విషయంలో ప్రభు త్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మే రకు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పాలెం వాగు గేట్లు, రెగ్యులేటర్ సమస్యల పరిషారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం 5వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నదని తెలిపారు.
మంత్రికి ఎంపీ చామల వినతి
జనగామ నియోజకవర్గం తపాస్‌పల్లి రిజర్వాయర్ డీ3 కెనాల్ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దూళ్మిట్ట, చేర్యాల మండలాల్లో 7 వేల ఎకరాలకు రంగనాయకసాగర్ ద్వారా నీరు అందించవచ్చని వివరించారు. సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.