Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్.. తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు.
ఇటీవలే న్యూయార్క్‌లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో.. బైడెన్ తడబడ్డారు. స్టేజ్‌పైకి బైడెన్ వెళ్తుండగా.. అంతా చప్పట్లు కొట్టారు. దీంతో ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన బైడెన్.. ఆ తర్వాత ‘వెల్కమ్ టు వాషింగ్టన్’ (Welcome to Washington) అంటూ ప్రసంగం మొదలు పెట్టారు.
ఏ రాష్ట్రంలో ఉన్నామన్నది కూడా గుర్తు లేకుండా న్యూయార్క్ (New York)కు బదులు ‘వాషింగ్టన్’ అని సంబోధించారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగిపోగిపోయిన బైడెన్.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. అధ్యక్షుడి తీరుతో అక్కడివారు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Joe Biden mixed up his location:
“Welcome to Washington,” said the American president, while in New York. pic.twitter.com/2A1hCfNfFf
— InnA (@Inna_Inna_Iv) September 25, 2024
మతిమరుపు, పొరపాట్లతో అధ్యక్షుడు బైడెన్ ఇటీవలే నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకరిపేరు పలకడానికి బదులు మరొకరి పేరు పలకడం, పలు సందర్భాల్లో ఆయన ఎటూ కదలకుండా చలనం లేని రీతిలో నిలుచుండిపోవడం వంటివి జరిగాయి. దీంతో బైడెన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. 83 ఏళ్ల బైడెన్ వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధ్యక్షుడికి పార్కిన్సన్ (Parkinson) ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ (Kevin O’Connor) స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం అద్భుతంగా ఉందని తెలిపారు.
‘అధ్యక్షుడి హెల్త్ అద్భుతంగా ఉంది. ఆయన మెదడు బాగా పనిచేస్తోంది. అంతా అనుకుంటున్నట్లు ఆయనకు పార్కిన్సన్కు సంబంధించిన ఎటువంటి సమస్యా లేదు’ అని స్పష్టం చేశారు. ఆయన పదవీ కాలం ముగిసేనాటికి ఏమైనా మార్పులు ఉంటాయా అని విలేకరు ప్రశ్నించగా.. ‘పదవీకాలం ముగిసేనాటికి అధ్యక్షుడి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చు’ అని తెలిపారు.
ఈ క్రమంలోనే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన బైడెన్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పోటీకి దిగారు. ఆమెకు డెమోక్రట్ల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడా లభిస్తోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హారిస్ తలపడబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read..
Manu Bhaker | ఒలింపిక్స్ పిస్టల్ ధర రూ.కోటి..?.. మను బాకర్ స్పందన ఇదే
Senthil Balaji | సెంథిల్ బాలాజీకి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Hindu Temple | అమెరికాలో మరో ఆలయంపై దాడి.. హిందూస్ గో బ్యాక్ అంటూ రాతలు