Group-1 Mains | హైదరాబాద్ : ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన కార్యాలయం నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు, సెక్రటేరియట్ నుంచి డీజీపీ జితేందర్, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నీకోలస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..
KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..! కేటీఆర్ ఫైర్
NIMS | పదేండ్లలో 1,000కి పైగా సర్జరీలు.. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్లో నిమ్స్ అరుదైన రికార్డు