Telangana Decade Celebrations | మత ఘర్షణలు.. అల్లర్లు, హత్యలు.. ఉగ్ర దాడులు.. దొంగతనాలు, దోపిడీలు.. ఇదీ ఒకప్పటి హైదరాబాద్.
ఐటీ ఫ్రెండ్లీ సిటీ.. వర్క్ ఫ్రెండ్లీ సిటీ.. బిజినెస్ ఫ్రెండ్లీ సిటీ.. లివింగ్ ఫ్రెండ్లీ సిటీ.. ఇదీ ఇప్పటి హైదరాబాద్
SRDP | హైదరాబాద్ : దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే మాటలా.. అలాంటిది హైదరాబాద్‌ను దేశంలో అగ్రభాగాన నిలిపింది తెలంగాణ ప్రభుత్వం. తొమ్మిదేండ్లలోనే బెస్ట్ సిటీగా మార్చి ప్రపంచ దేశాలను హైదరాబాద్ వైపు తిప్పింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్హ్రిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఈ విషయంలో ప్రభుత్వ సహకారం, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యూహాలు కీలకంగా మారుతున్నాయి. కేటీఆర్ మార్గదర్శకత్వంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ బృందంగా జీహెచ్ఎంసీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. తొమ్మిదేండ్లలో జీహెచ్ఎంసీ గణనీయమైన ప్రగతి సాధించింది. 2014 నుంచి రూ.7,644.55 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
వరద ముంపునకు శాశ్వత పరిష్కారం
వందేండ్ల తర్వాత 2020 అక్టోబర్‌లో కురిసిన వర్షాలు నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కారు సంకల్పించింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) తొలి విడతకు శ్రీకారం చుట్టింది. నాలాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. ఒకటి, రెండు చోట్ల మినహా రూ.985.45 కోట్ల పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 100 శాతం పనులు పూర్తయ్యాయి. 13 చోట్ల నాలా అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఎన్డీపీ రెండో దశలో రూ.5,135.15 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించి రూ.2,141.22 కోట్లతో 148 పనులు, రూ.2,993.93 కోట్లతో శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధుల్లో 267 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ప్రభుత్వ పరిపాలన అనుమతులు రాగానే పనులు ప్రారంభం కానున్నాయి.
పేదలకు అక్షయపాత్రగా రూ.5 భోజనం
ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తున్నది. అన్నపూర్ణ భోజన పథకం ద్వారా 10.50 కోట్ల మందికిపైగా భోజనం అం దించారు. ఇందుకోసం రూ.210 కోట్లు ఖర్చు చేశారు. 2014 మార్చి 1న 8 కేంద్రాలతో ప్రారంభమైన క్యాంటీన్లు.. 150కి చేరాయి. ప్రతి రోజు 45 వేల భోజనాలు అందిస్తున్నారు.
చెత్త నుంచి 100.5 మెగావాట్ల విద్యుత్తు
చెత్తతో సంపద సృష్టించేందుకు జీహెచ్ఎంసీ విడతలవారీగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పుతున్నది. జవహర్‌నగర్‌లో 19.5 మెగావా ట్ల విద్యుత్తు ప్లాంట్‌ను స్థాపించగా, ఇటీవల సా మర్థ్యాన్ని 24 మెగావాట్లకు పెంచారు. ఇక్కడే మరో 24 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్క జవహర్‌నగర్‌లోనే 48 మెగావాట్ల విద్యు త్తు ఉత్పత్తి జరగనున్నది. ఇప్పటి వరకు 6.35 లక్షల ఆర్డీఎఫ్ వినియోగించి 225 మెగా యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. బీబీ నగర్లో 11 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా మొత్తం 100.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. జవహర్‌నగర్‌లో కాలుష్య శుద్ధి ప్లాంటును ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు.
భవన వ్యర్థాలకు ఓ అర్థం
భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్‌లోకి తీసుకొచ్చేందుకు నగరం నలువైపులా నాలుగు చోట్ల ప్రభుత్వం (కన్స్ట్రక్షన్స్ అండ్ డిమాలిషన్) ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ సారథ్యంలో ‘రీ సైస్టెనబులిటీ సంస్థ (రాంకీ) ఆధునిక వెబ్ టెక్నాలజీతో 2020 నవంబర్‌లో జీడిమెట్ల కేంద్రం, 2021 జూన్‌లో ఫతుల్లాగూడ కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ జోన్ వైపు శామీర్‌పేట మండలం తూంకుంట, చార్మినార్ జోన్‌వైపు శంషాబాద్ మండలం సాతంరాయికుంటలోని యూనిట్లు ఒక్కోటి 500 మెట్రిక్ టన్నులను రీసైక్లింగ్ చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాల రీసైక్లింగ్ సామర్థ్యం ప్లాంట్లు ఉంటాయి.
పాదచారులకు రక్షణ
పాదచారుల భద్రత, ప్రమాదాల నివార ణకు ఈ ఏడాది రూ.32.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 10 ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మదీనాగూడ, మియాపూర్, పంజాగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, నేరెడ్మెట్ బస్టాండ్, ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఆరు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 4,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి, కమర్షియల్ ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. వీటిని నగరంలోని 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
నిరుపేదలకు ఆత్మగౌరవ ఇండ్లు
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సీఎం కేసీఆర్ ఆశయం త్వరలో నెరవెరబోతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష రెండు పడకల గదుల ఇండ్లను మంజూరు చేశారు. అందులో 109 ప్రాంతాల్లో 98,576 గృహాల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటి వరకు 68 లొకేషన్లలో 67,782 రెండు పడకల గ దులు పూర్తయ్యాయి. అందులో 29 ప్రాం తాల్లో 6 వేల గృహాలు పంపిణీ చేశారు. ఇంకా 30,794 గృహాల నిర్మాణాలు తుదిదశలో ఉ న్నాయి. మరో రెండు చోట్ల 1,424 గృహాలు వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు.
147% పెరిగిన అటవీ విస్తీర్ణం
తెలంగాణకు హరితహారంలో భాగంగా హై దరాబాద్ మహానగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. యాదాద్రి మోడల్ మియావాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ, ట్రీ పార్ల లాంటి సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. 2020లో హైదరాబాద్‌కు ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గుర్తింపు దక్కింది.
రహదారుల అభివృద్ధిలో వ్యూహాత్మకం
జీహెచ్ఎంసీలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకాన్ని చేపట్టిన ప్రభుత్వం అనతికాలంలోనే రవాణా వ్యవస్థను సిగ్నల్ రహితం గా మార్చింది. తొలి విడతలో రూ.5,937 కోట్లతో 48 చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులతో తొమ్మిదేండ్లలోనే 35 చోట్ల (రూ.3,248.53 కోట్లు) ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరో 13 చోట్ల రూ.3,515.33 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి.
బహు ప్రయోజనాల లింకు రోడ్లు
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం రహదారులను అభివృద్ది చేస్తున్నది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున లింక్ రోడ్లను నిర్మిస్తున్నది. రూ.2,140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్హ్రిత నగరంగా తీర్చిదిద్దుతున్నది. తొలి విడతలో రూ.275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోర్ సిటీలోనూ రూ.207.26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా, 70 శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా ఫేజ్-3కి శ్రీకారం చుట్టారు. 50 రోడ్లను 120.92 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ.1,500 కోట్లతో పనులు చేపట్టారు. శివారు మున్సిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా, మిగిలినచోట టెండర్ దశలో ఉన్నాయి. వచ్చే 50 ఏండ్ల వరకు ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేలా రోడ్ నెట్‌వర్క్‌ను హెచ్ఆర్డీసీఎల్ అభివృద్ధి చేస్తున్నది.
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు విజయాలు:
గర్వించేలా సామాన్యుడి వేడుక
పేదలు కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో పెండ్లిళ్లు చేసుకోవాలనే కోరికను జీహెచ్ఎంసీ నేరవేర్చుతున్నది. రూ.95.70 కోట్ల అంచనా వ్యయంతో 25 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టగా అందులో రూ.30.10 కోట్ల వ్యయంతో 9 ఫంక్షన్ హాళ్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.31.89 కోట్ల విలువైన 9 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాళ్లలో అత్యాధునిక కిచెన్, పారింగ్ సౌకర్యం, తాగు నీటి వసతి, పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు బట్టలు మార్చుకునేందుకు గదులు, ప్రత్యేక స్నానాల గదులు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్, కమ్యూనిటీ హాల్, రెండంతస్థుల భవనాలు నిర్మించారు.
ఎస్ఆర్డీపీకి అడుగులు ఇలా..
జీహెచ్ఎంసీ 2015లో ఎస్ఆర్డీపీని ప్రారంభించింది. రూ.26 వేల కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని వివిధ రద్దీ జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ రవాణా మార్గాలు ఏర్పాటు చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఎస్ఆర్డీపీ అసలు స్వరూపం (కి.మీ.)
ప్రాజెక్టు : పొడవు
7 స్కైవేలు : 135
11 మేజర్ కారిడార్స్ : 166
68 మేజర్ రోడ్స్ : 348
ఇతర రోడ్లు : 1400
గ్రేడ్ సెపరేటర్స్ : 54
మైండ్‌స్పేస్ జంక్షన్
బై డైరెక్షన్ ఫ్లైఓవర్, బై డైరెక్షన్ అండర్‌పాస్ నిర్మాణం జరిగింది. మైండ్‌స్పేస్ జంక్షన్, టీఐఎస్ ఫ్లై ఓవర్‌తో పాటు అండర్‌పాస్‌ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గింది. ఐటీ కారిడార్‌లో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఇది ప్రధాన కారిడార్.
బయో డైవర్సిటీ జంక్షన్
బయో డైవర్సిటీ జంక్షన్ 1, 2 లెవల్ ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి నుంచి జేఎన్టీయూ వరకు, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
Roads1
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి
ఇనార్బిట్ మాల్ సమీపంలో మాదాపూర్ వద్ద నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రపంచంలోనే అతిపొడవైన 233 మీటర్ల సింగిల్ స్పాన్ కలిగిన ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి. ‘మేక్ ఇన్ ఇండియా’ను దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన పూర్తిగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఎల్అండ్టీ సంస్థ చేపట్టింది. దీని వల్ల ఇతర ప్రాంతాల నుంచి మాదాపూర్‌కు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో తొలి వేలాడే వంతెనగా నిలిచింది.
ఎల్బీనగర్ ఫ్లైఓవర్, అండర్‌పాస్
ఎల్బీనగర్, నాగోల్, కామినేని జంక్షన్, బైరామల్‌గూడ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్లతో ఉప్పల్ నుండి విమానాశ్రయం వరకు ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా 30 కిలోమీటర్ల మేర ప్రయాణం సజావుగా సాగుతుంది
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్
ఓఆర్ఆర్ నుండి హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ వరకు అనుసంధానం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్లై ఓవర్ ఐటీ రంగంతో పాటు స్థానికవాసులకు ఉపశమనం లభించింది.
షేక్‌పేట ఫ్లైఓవర్
ఓయూ కాలనీ ఫ్లైఓవర్ నాలుగు జంక్షన్లను దాటుతుంది. రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్‌కు ఉపశమనం లభించింది. రేతిబౌలి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఓఆర్ఆర్ గచ్చిబౌలిని కలుపుతూ ఈ నిర్మాణం జరిగింది. కోర్ సిటీతో పాటు ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగింది.
జారీచేసిన వారు: స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ