Hyd Airport | సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల ఆందోళన
Hyd Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పలు సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయి.
Hyd Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పలు సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-కౌలాలంపూర్, హైదరాబాద్-వియత్నాం విమానాలు సాంకేతిక లోపంతో రద్దు చేశారు. హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఎయిర్స్‌లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్‌బస్ 984 ఫ్లయిట్ ఆలస్యమైంది. శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వియత్నాం వెళ్లాల్సిన ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఎయిర్‌లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు 500 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దాంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఆటోమేటెడ్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో సాంకేతిక సమస్య కారణంగా మంబయిలో విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సహాయపడుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

