Mali | పశ్చిమ ఆఫ్రికా దేశం (West African nation) మాలి (Mali)లో ఐదుగురు భారతీయులు కిడ్నాప్‌కు (Indians kidnapped) గురయ్యారు. పశ్చిమ మాలిలోని కోబ్రి (Kobri) పట్టణ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగినట్లు అక్కడి భద్రతా వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆఫ్రికన్ దేశం ప్రస్తుతం అల్ ఖైదా, ఐసిస్ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో భారతీయుల కిడ్నాప్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కిడ్నాప్‌కు గురైన బాధితులు ఓ విద్యుదీకరణ ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు వారిని బలవంతంగా లాక్కెళ్లిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం కంపెనీలో పనిచేస్తున్న మిగతా భారతీయులను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ కిడ్నాప్‌కు ఏ గ్రూపూ ఇప్పటి వరకూ బాధ్యత వహించలేదు. 2012 నుంచి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుకుతోన్న ఆఫ్రికా దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్‌లు జరగడం సర్వసాధారణమైపోయింది. ఇటీవలే కొందరు విదేశీయులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. చర్చల అనంతరం కొంత డబ్బు చెల్లించాక గత వారమే వారిని విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది.
Also Read..
Delhi Airport | 36 గంటల తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్థితికి విమాన కార్యకలాపాలు
Ajit Pawar | అది ప్రభుత్వ భూమి అని నా కుమారుడికి తెలియదు.. భూ కుంభకోణంపై అజిత్ పవార్
Vande Bharat | నాలుగు వందే భారత్ రైళ్లను జాతికి అంకితం చేసిన ప్రధాని..