Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ (Ajit Pawar) కుమారుడు పార్థ్పవార్ (Parth Pawar)పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలపై అజిత్ పవార్ తాజాగా స్పందించారు. అది ప్రభుత్వ భూమి (government property) అని తన కుమారుడికి తెలియదని చెప్పారు. ఈ మేరకు ఆ భూ కేటాయింపును రద్దు చేసినట్లు అజిత్ పవార్ ప్రకటించారు. ‘అది ప్రభుత్వానికి చెందిన భూమి అని నా కుమారుడు పార్థ్, ఆయన వ్యాపార భాగస్వామికి తెలియదు. ఆ భూ కేటాయింపును రద్దు చేశాం. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది. దీన్ని అమ్మడం లేదా కొనడం చేయడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరగలేదు. రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందన్నది విచారణలో తేలుతుంది’ అని అన్నారు.
కాగా, దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన 40 ఎకరాల మహర్వతన్ భూమిని పార్థ్ పవార్‌కు చెందిన కంపెనీ అమీడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 300 కోట్లకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించారు. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ లావాదేవీలో కేవలం లక్ష రూపాయల మూలధనం కలిగిన పార్థ్పవార్ కంపెనీ అమేడియా హోల్డింగ్స్ ఎల్ఎల్పీకి రూ.21 కోట్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. పుణే తహసీల్దార్ సూర్యకాంత్ యెవ్లే, డిప్యూటీ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది.
Also Read..
Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
Uttarakhand | మేనల్లుడి అంత్యక్రియలకు వెళ్తే.. గొంతు కోసి చంపేశారు
Time Bank | టైమ్‌ను దాచుకునే బ్యాంక్.. సమయాన్ని డిపాజిట్ కూడా చేయొచ్చు!