తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం పంచాయతీలో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సమయాన్ని డిపాజిట్ చేసి, అవసరమైనపుడు సమయాన్ని వాడుకోవచ్చు. వృద్ధులకు సహాయం చేయడానికి యువత వెచ్చించే సమయాన్ని డిపాజిట్‌గా నమోదు చేస్తారు. ఉదాహరణకు, వృద్ధులను దవాఖానకు తీసుకెళ్లడానికి, కిరాణా సరుకులు తెచ్చిపెట్టడానికి యువత ఖర్చు చేసే సమయాన్ని టైమ్ అకౌంట్లో డిపాజిట్‌గా పరిగణిస్తారు.
డిపాజిట్‌దారులకు సాయం అవసరమైనపుడు ఈ పంచాయతీవారు వలంటీర్లను పంపిస్తారు. జపాన్‌లోని ‘ఫురియల్ కిప్పు స్ఫూర్తితో ఈ టైమ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నారు. నగరాల్లో ఒంటరితనంతో జీవించే వృద్ధులకు సాయపడటం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీని వల్ల శారీరక, మానసిక సమస్యలతో బాధపడే వృద్ధుల్లో ఆందోళన తగ్గుతున్నట్లు వైద్యులు తెలిపారు.