నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం (Road Accident) తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు గుండ్రాంపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో మంటలు చెలరేగి కారు దగ్ధమయింది. అయితే అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో చిట్యాల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.