Road Accident | ఏపీలోని కాకినాడలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, ప్రయాణికులపైకి కారు దూసుకువెళ్లింది. అన్నవరంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి.. జగ్గంపేట వైపు వెళ్తున్న కారు ముందు టైరు ఒక్కసారిగా పేలింది. దాంతో రెండు ద్విచక్ర వాహనాలు, రిక్షాను వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. సమాచారం అందుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
