Cold Weather | వణికిస్తున్న చలి.. బేలలో కనిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా (Low Temperatures) నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా (Low Temperatures) నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల (Cold Waves) తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 డిగ్రీలు నమోదయింది.
సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, శంకర్పల్లి 14.9, మొయినాబాద్ 15 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్‌లో 15.3, హెచ్‌సీయూలో 15.3, బీహెచ్ఈఎల్ 15.5, మల్కాజిగిరి 15.7, కుత్బుల్లాపూర్ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్‌పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరేడ్మెట్ 17.1, అల్వాల్ 17.1, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఈ నెల 9న మరింత తకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది.
COLD WEATHER INTENSIFIES 🥶
Today’s lowest temperatures in °C
Telangana toppers
Bela Adilabad 14.7
Shahbad Rangareddy 14.7
Zahirabad Sangareddy 14.8
Shankarpally 14.9
Moinabad 15
Bheempoor Adilabad 15
Jinnaram Sangareddy 15.1Hyderabad toppers
Rajendranagar 15.3
UoH 15.3…— Telangana Weatherman (@balaji25_t) November 8, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

