SV University : తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో, మెట్ల మార్గంలో అడవి జంతువులు కనిపించడం చూశాం. కానీ, ఈసారి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (SV University) ఆవరణలో చిరుతపులి (Leopard) ప్రత్యక్షమైంది. శుక్రవారం సాయత్రం ప్రాంగణంలోని భవన నిర్మాణ ప్రాంతంలో కుక్కను చిరుత తరుముతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
యూనివర్సిటీ ప్రాంగణంలోకి చిరుత రావడంతో విద్యార్దులు, సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. దాంతో, విద్యార్దులు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. బ్లాక్‌ల నుంచి విద్యార్థులెవరూ బయట ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే శబ్దం చేస్తూ వెళ్లాలని సూచించారు.