AP News | ఏపీలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ( స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు – SIPB) ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం 12వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
| కంపెనీ (Company) | పెట్టుబడి (₹ కోట్లు) | ఉద్యోగాలు (No. of jobs) |
|---|---|---|
| రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్స్ లిమిటెడ్ | 202 | 436 |
| ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 700 | 1,000 |
| ఎన్పీఎస్పీఎల్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ | 2,081 | 600 |
| క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్ | 1,154 | 1,500 |
| ఎస్సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ | 550 | 1,130 |
| ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ | 22,976 | 1,241 |
| ఫ్లూయింట్గ్రిడ్ లిమిటెడ్ | 150 | 2,000 |
| మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ | 110 | 700 |
| క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ | 115 | 2,000 |
| రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ | 2,172 | 9,681 |
| విశాఖ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ | 2,200 | 30,000 |
| ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 119 | 2,000 |
| సీల్ సోలార్ పీ12 ప్రైవేట్ లిమిటెడ్ | 1,728 | 860 |
| నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ | 7,972 | 2,700 |
| మైరా బే వ్యూ రిసార్ట్స్ | 157 | 980 |
| విశ్వనాథ్ స్పోర్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 51 | 750 |
| సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ | 1,247 | 1,100 |
| సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ | 8,570 | 1,000 |
| వాల్ట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ | 1,682 | 415 |
| ఏఎమ్జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ | 44,000 | 3,000 |
| వాసంగ్ ఎంటర్ ప్రైజెస్ | 898 | 17,645 |
| బిర్లా లిమిటెడ్ | 240 | 588 |
| సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ | 1,090 | 1,250 |
| భారత్ డైనమిక్స్ | 489 | 500 |
| డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ | 1,234 | 1,454 |
| శ్రీవేదా ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ | 12 | 1,500 |