Actor Vijay : ఇవాళ (సోమవారం) నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీ పాలకవర్గ సమావేశం జరుగనుంది. వెల్లూర్ జిల్లా చెన్నై-బెంగళూరు (Chennai-Bengalore) జాతీయ రహదారిపైగల పల్లికొండ టోల్‌ప్లాజా (Pallikonda Toll Plaza) సమీపంలోని అగరంచేరి గ్రామంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు నటుడు విజయ్ సమీపంలోని కాంచిపురం పట్టణానికి చేరుకున్నారు. పార్టీ పాలకవర్గ సమావేశంలో నటుడు విజయ్ కీలక ప్రసంగం చేయనున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలో దిగుతున్న విజయ్.. ఎన్నికల వేళ పార్టీ అనుసరించాల్సిన కీలక వ్యూహంపై పాలకవర్గంతో చర్చించనున్నారు. విజయ్ కాన్వాయ్ కాంచిపురం చేరుకోగానే దారిపొడవునా పలు ప్రాంతాల్లో ప్రజలు చేతులు ఊపుతూ వెల్కమ్ చెప్పారు. వారికి రెండు చేతులతో నమస్కరిస్తూ విజయ్ ముందుకు వెళ్లారు.
#WATCH | Tamil Nadu: Tamilaga Vettri Kazhagam (TVK) chief and Actor Vijay arrives in Kanchipuram.
Vijay will shortly address the administrators’ meeting of Tamilaga Vettri Kazhagam (TVK) at Agaramcheri village near the Pallikonda toll plaza, off the Chennai–Bengaluru Highway… pic.twitter.com/4Wmyr1DUkY
— ANI (@ANI) February 23, 2026