గురువారం 09 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 11:54:15

టిమ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర బృందం

టిమ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి కేంద్ర బృందం పర్యటిస్తున్నది. ఇందులోభాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని బృందం గచ్చిబౌలిలోని టిమ్స్‌ దవాఖానును పరిశీలించింది. దవాఖానలోని ఐసోలేషన్‌, ఐసీయూ గదులను, కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం గాంధీ దవాఖాన, దోమల్‌గూడ కంటైన్‌మెంట్‌ జోన్లను సందర్శించనుంది. తర్వాత సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీకానుంది.


logo