ఖైరతాబాద్, సెప్టెంబర్ 21 : ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తొలుత షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయగా, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కేసు బదలాయించారు. సీఐ శోభన్‌కుమార్ కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెంది న బాధితురాలు.. కేఏ పాల్ వద్ద ఆగస్టు 28న ఉద్యోగంలో చేరింది. ఆమెకు యూఎస్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించాడు. విధుల నిర్వహణలో కేఏ పాల్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాట్సాప్‌లో సైతం అసభ్య మెసేజ్‌లు పంపించాడు. దీంతో ఈ నెల 12న బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేసింది.
శనివారం రాత్రి షీటీమ్స్‌ను ఆశ్రయించగా, వారు కేసును పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్‌పై సెక్షన్ 75, 76, 78 బీఎన్ఎస్ కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. పాల్ తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడంటూ యువతి ఆరోపిస్తుండగా, ప్రస్తుతం అవి డిలీట్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏం ఉంది?ఎందుకు డిలీట్ అయ్యాయి? ఏమైనా కాల్ డాటా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆయన ఫోన్ సైతం స్విచ్ఛాప్ వచ్చినట్టు చెబుతున్నారు.