సూర్యాపేటటౌన్, నవంబర్ 20: గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 15న సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల -ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో సుమారు 50 సం వత్సరాలున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో క్లూస్ టీం సిబ్బంది ఫింగర్ ప్రింట్ డేటా బేస్ లో ఉన్న నేరస్తుల వేలిముద్రల ఆధారం గా మృతుడిని గుర్తించారు.
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఫింగర్ ప్రింట్స్, సీసీ టీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో 9 మంది నిందితులను గుర్తించారు. నిందితులను హైదరాబాద్లోని జీడిమెట్లలో అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన రెండు కార్లు, తాళ్లు, యాసిడ్ క్యాన్, క్లాత్, 10 సెల్ఫోన్న్లను సీజ్ చేశారు. నిందితులు ఆంధ్రాలోని కోనసీమ జిల్లా అమలాపురం మం డలానికి చెందిన వారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మృతుడు పాత నేరస్తుడు కావడంతో వేలిముద్రల ఆధారంగా ఆయన ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం మండలానికి చెందిన నాగవరపు సత్యనారాయణ గా గుర్తించారు.
మృతుడు 2023 జూలై 15న హైదరాబాద్ బోయిన్పల్లిలోని బామ్మర్ది, గెల్లా కిరణ్ ఇంట్లో భార్యతో గొడవపడి కత్తితో దాడి చేసి భార్య ఝాన్సీరాణిని చంపి బావమరిది భార్య గల్లా షీలాను గాయపర్చిన కేసులో నిందితుడిగా గుర్తించారు. మృతుడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యకేసులో విచారణ ఖైదీగా జైలుకెళ్లాడు. ఈ కేసు విచారణలో ఉండగా ఈనెల 6న సత్యనారాయణ బెయిల్పై వచ్చి ఈ నెల 7న కరక్కాయపేటకు వెళ్లి, బామ్మర్ది కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండే దొండపాటి విశ్వనాథంతో కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అందరిని చంపుతానని హెచ్చరించాడు.
ఇదే విషయాన్ని కిరణ్కు ఫోన్ చేసి విశ్వనాథం చెప్పాడు. సత్యనారాయణ బతికి ఉంటే తమని చంపుతాడని బావించి తామే చంపాలని కిరణ్, తన పెద్ద అక్క చీకురుమిల్లి అమ్మాజీ, బావ మాధవరావు, వారి కుమారుడు శశికుమార్, కుమార్తె మౌనిక, కిరణ్ మేనమామ సర్వేశ్వర్రావు, కిరణ్ భార్య శీల, కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండే విశ్వనాథం కలసి హత్యకు పథకం వేశారు. సత్యనారాయణ కోర్టు వాయిదాలకు హైదరాబాద్కు వచ్చినప్పుడు చంపాలని నిర్ణయించుకొని ఈనెల 14న సత్యనారాయణ సికింద్రాబాద్ కోర్టుకు వాయిదాకు వెళ్లి బయటకు వస్తుండగా రెండు కార్లలో వెం బడించి పట్టుకున్నారు.
కారులో వేసుకొని కొద్ది దూరం వెళ్లాక గొంతుపై కాలు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం హైదరాబాద్లోని ఔటర్ రిం గ్ రోడ్డుపై నుంచి కారులో వచ్చి సత్యనారాయణ శవాన్ని పిల్లలమర్రి శివారులో రోడ్డు పక్కన చిన్న కాల్వలో పడేశారు. శవాన్ని గుర్తించకుండా ఉండేందుకు శవంపై యాసిడ్ పోసి అక్కడి నుంచి విజయవాడ వెళ్లి మరుసటి రోజు హైదరాబాద్ వెళ్లారు. ఈ కేసును ఛేదించిన సూ ర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, క్లూస్ టీండాగ్ స్కాడ్ సిబ్బందిని, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్, పెన్పహడ్ ఎస్ఐ గోపీకృష్ణను, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్సు అందించారు.