మల్హర్, ఫిబ్రవరి 26 : డెహ్రాడూన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ఆదర్శ పాఠశాల ఏడోతరగతి విద్యార్థిని చిందం సౌమ్య అసాధారణ ప్రతిభ కనబర్చింది. తెలంగాణ నుంచి సౌమ్య ఒక్కరే విజయకేతనం ఎగురవేయడం విశేషం. మల్హర్ మండలం తాడిచెర్లకు చెందిన చిందం భాస్కర్, హాసిని దంపతుల కుమార్తె సౌమ్య కాటారంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్నది.
డెహ్రాడూన్‌లో గత డిసెంబర్ 7న జరిగిన ఆర్ఐఎంసీ పరీక్షకు దక్షిణ భారతదేశం నుంచి పాల్గొన్నది. గణిత శాస్త్రంలో శిక్షణ ఇచ్చిన మనీశ్కుమార్తోపాటు ప్రిన్సిపాల్ కార్తీక్‌రావు అందించిన సహకారంతోనే తమ కూతురు సత్తాచాటిందని తల్లిదండ్రులు తెలిపారు. సౌమ్యకు ప్రిన్సిపాల్‌తోపాటు శిక్షకుడు అభినందనలు తెలిపారు.