హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ కళలపై ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ శిబిరాన్ని ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఆర్ఐ) సంచాలకురాలు డాక్టర్ సముజ్వల గురువారం ప్రారంభించారు.
ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం తదితర ఐటీడీఏల నుంచి ఎంపిక చేసిన 20 మంది క్రాఫ్ట్ టీచర్స్, 10 మంది గిరిజన ఆర్టిజన్స్కు ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ అనే అంశంపై ఐదు రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఐ క్యురేటర్ డాక్టర్ డీ సత్యనారాయణ, ఎస్హెచ్హెచ్వోపీ డైరెక్టర్ డాక్ట ర్ సునీతాప్రసాద్, ట్రైనింగ్ కో ఆర్డినేటర్ అజ్మీరాశైలజ తదితరులు పాల్గొన్నారు.