సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ); గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణ స్థాయిని దాటి పెరుగుతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 డిగ్రీలు పెరిగి 33.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 2.4 డిగ్రీలు పెరిగి 20.4, గాలిలో తేమ 33 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.