Dangerous Stunt | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై తిరుగుతున్నామన్న సోయి కూడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవలే కొన్ని యువ జంటలు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహా వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట (Delhi Couples) పబ్లిక్‌గా హద్దులు మీరి ప్రవర్తించింది. ఓ వ్యక్తి రన్నింగ్ కారు పైకి ఎక్కి ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunt) ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా విండోలో నుంచి తల బయటకు పెట్టిన ప్రియురాలికి బహిరంగంగా ముద్దులు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటుగా వెళ్తున్న వారు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Royal Bengal Tiger | దాదాపు 30 ఏళ్ల తర్వాత.. గుజరాత్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్
Delhi Blast | పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసిన డాక్టర్ ఉమర్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం