Royal Bengal Tiger | గుజరాత్ (Gujarat) అడవుల్లో అరుదైన దృష్యం కనిపించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) కనిపించింది. ఈ విషయాన్ని అక్కడి అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
దాహోద్ (Dahod) జిల్లాలోని రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం (Ratan Mahal Wildlife Sanctuary)లో గత తొమ్మిది నెలలుగా మగ పులి నివసిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో రాయల్ బెంగాల్ టైగర్ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఈ పెద్ద పులి వయసు దాదాపు 5 ఏళ్లు ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పులిని మొదట మధ్యప్రదేశ్‌లోని ఝబువా, కథివాడ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రతన్ మహల్ సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించారు. అప్పటి నుంచి అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, ఫీల్డ్ టీమ్‌ల ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు. కాగా, గుజరాత్ ఇప్పటికే ఆసియా సింహాలకు నిలయంగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Delhi Blast | పార్కింగ్‌లోనే బాంబు తయారు చేసిన డాక్టర్ ఉమర్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం
Al Falah Group: టెర్రర్ ఫండింగ్.. 13 రోజుల పాటు ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్
Vehicle Fitness | వాహన ఫిట్నెస్ టెస్టు ఫీజు 10 రెట్లు పెంపు