KP Vivekananda | రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు 420 హామీలపై ప్రభుత్వ దాటవేత ధోరణిని ప్రశ్నిస్తామన్నారు.
గురుకులాల అసమర్థ నిర్వహణను, విద్యార్థుల మరణాలను ప్రస్తావిస్తాం.. ఎవరిని సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఆర్డినెన్స్ తెచ్చి విలీనం చేయడాన్ని గట్టిగా నిలదీస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగడుతాం.. రైతులకు బోనస్ బోగస్ అయిన అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు.
యూరియా కొరతపై రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతాం. మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్‌కు సింగరేణి సంస్థ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. తూతూ మంత్రంగా ఒకటి రెండు రోజులు అసెంబ్లీ పెడతామంటే ఒప్పుకునేది లేదు .
ప్రజా సమస్యలన్నీ చర్చించేదాకా అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిందేనన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ కు సీఎం సహా కాంగ్రెస్ నేతలు గజ గజ వణికి పోతున్నారు .అందుకే పిచ్చి కూతలు కూస్తున్నారుజ పదేళ్ల కేసీఆర్ పాలనపై కూడా అసెంబ్లీలో మేము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!