Group-2 Hall Tickets | హైదరాబాద్ : ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లపై పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించుకోవాలి. లేని యెడల సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఇక ప్రభుత్వంచే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రం వద్ద చూపిస్తేనే అనుమతించనున్నారు. పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ను గుర్తింపు కార్డు కింద పరిగణించనున్నారు.
ఇక ఉదయం సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌కు 1.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మార్నింగ్ సెషన్‌కు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌కు 2.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. అంటే పరీక్ష ప్రారంభానికి అర గంట ముందే గేట్లు క్లోజ్ చేయనున్నారు. ఆ తర్వాత ఎవరికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
క్యాలికులేటర్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్‌లు, సెల్ ఫోన్స్, బ్లూ టూత్ డివైజెస్, వాచ్, మ్యాథమేటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, లాగ్ టేబుల్స్, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, జ్యువెలరీ(మంగళసూత్రం, గాజులకు అనుమతి ఉంది) వంటి వస్తువులకు అనుమతి లేదు. షూ ధరించిన అభ్యర్థులకు అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆశా వర్కర్లపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Shobitha Dhulipala | తల నుంచి కాలి వరకూ మొత్తం బంగారమే.. శోభిత బ్రైడల్ లుక్.. PHOTOS