Harish Rao | ఆశా వర్కర్లపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Harish Rao | కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆశా వర్కర్ల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆశా వర్కర్ల కొంగులు లాగుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు.
Harish Rao | హైదరాబాద్ : కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆశా వర్కర్ల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆశా వర్కర్ల కొంగులు లాగుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆశాలపై చేయి చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? తెలంగాణ ఏర్పాటుకు మందు ఆశాల గౌరవ వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, కేసీఆర్ రూ. 10 వేలకు పెంచి వారి సేవలను గుర్తించారు, వారిని గౌరవించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో… pic.twitter.com/9LNEZMxlF4
— Harish Rao Thanneeru (@BRSHarish) December 9, 2024
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా
TGPSC | గ్రూప్-2 హాల్ టికెట్స్ విడుదల..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

