MLC Vani Devi | హైదరాబాద్ : ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదు.. కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ వాణిదేవీ తెలంగాణ భవన్లో మాట్లాడారు.
తెలంగాణ తల్లి మన అస్తిత్వం చాటేలా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అలా లేదు. బీదగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు… బీదగా ఉండాలని ఎవరు కొరుకోరు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని చూడగానే దండం పెట్టుకునేలా శిల్పి రూపొందించారు అని వాణిదేవీ గుర్తు చేశారు.
శిల్పా శాస్త్రం ప్రకారం ఉండాల్సిన లక్షణాలు అన్నీ కేసీఆర్ హయాంలో రూపొందిన విగ్రహంలో ఉన్నాయి. బీదరికం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి ఉండాలా..? కోహినూరు వజ్రం లభించిన ఈ నేలలో తెలంగాణ తల్లికి కిరీటం ఉండకూడదా..? తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ.. తెలంగాణ తల్లికి రత్నాలు ఉండకూడదా..? కేసీఆర్ మీద అక్కసుతోనే తెలంగాణ విగ్రహం మార్చారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లా..?. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అంటే మహిళను అవమానించడమే. ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహం అని వాణిదేవీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-2 హాల్ టికెట్స్ విడుదల..
R Krishnaiah | మళ్లీ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య.. బీజేపీ తరపున రేపు నామినేషన్ దాఖలు
Acidity Home Remedies | రోజూ ఉదయం కడుపులో మంటగా ఉంటుందా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..!