Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని, సభకు రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-2 హాల్ టికెట్స్ విడుదల..
Siraj Vs Head: సిరాజ్ వర్సెస్ హెడ్.. ఇద్దరికీ ఐసీసీ శిక్ష !