Shobitha Dhulipala | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipala) వివాహం గత వారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లి వేడుకలో శోభిత ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేడుకల్లో భాగంగా శోభిత ధరించినవన్నీ నిజమైన బంగారు ఆభరణాలే అట (Real Gold Jewellery). తల నుంచి కాలి వరకూ ఆమె వేసుకున్న ప్రతి నగా స్వచ్ఛమైన బంగారమే అని తెలిసింది. తలకు కట్టుకున్న సంప్రదాయ బాసింగం నుంచి వడ్డాణం, ముక్కెర, చేతి వంకీలు, గాజులు, మీనాకారి ఝుంకాలు, ఉంగరాల దాకా.. ఇలా ప్రతి ఒక్కటీ రూబీ, బంగారం, డైమండ్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలిసింది.
పెళ్లిలో శోభిత ధరించి ఆభరణాలు.. దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్: I’ చిత్రంలోని ఐశ్వర్య రాయ్, త్రిష ధరించిన నగలను గుర్తు చేస్తాయి. జీవితాంతం గుర్తుండిపోయేలా తన పెళ్లి ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నట్లు తెలిసింది. ఇక తన జడను సౌత్ ఇండియన్ బ్రైడల్ ఆభరణాలతో అలంకరించుకుంది. తన బ్రైడల్ లుక్కు సంబంధించిన ఫొటోలను శోభిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Samantha | అలాంటి ప్రేమ మరొకటి లేదు.. చైతూ-శోభిత పెళ్లి వేళ హాట్‌టాపిక్‌గా సమంత పోస్ట్‌లు
Pushpa 2 The Rule | తగ్గిన పుష్ప 2 టికెట్ ధరలు.. సోమవారం నుంచి ఏ థియేటర్లో ఎంతంటే.!
RRR : Behind & Beyond | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!