KTR | హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ను పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకరినొకరు విమర్శించుకుంటారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హెగ్డేవార్‌ను పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి. ఏబీవీపీలో పనిచేసి, ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసింది రేవంత్ రెడ్డి. ఆయన వేసుకున్న నిక్కర్ కూడా ఖాకీ నిక్కర్ అని గతంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ – కాంగ్రెస్, ఈడీ – ఏసీబీ కలిసి కేసులు పెట్టుకున్నా.. మేము ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టు చెప్పుకుంటున్న రేవంత్ మాటలు ఈ సంవత్సరం జోక్. తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక.. ఇక ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతిచోట మోసాలకు పాల్పడుతుంది. గ్యారెంటీల పేరుతో ఓట్ల గారడినీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో కూడా ముమ్మాటికి ప్రజలు తిరస్కరిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. నిన్నటిదాకా కలిసి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌పైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా నోరుపారేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఒక అవకాశవాది, మోసకారి. ఆయన ఎన్నికల హామీ తప్పితే ఏమనాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి వెళ్లిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న మోసాలపైన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలను నిలదీయాలి. ఇంతగా ఇక్కడి ముఖ్యమంత్రి మోసం చేస్తున్నా కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అడగడం లేదో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను ఎత్తేయడం ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు