KTR | హైదరాబాద్ : తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పక పడుతుందని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో సంభాషిస్తూ.. రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఉప ఎన్నికలపైన వాదిస్తున్నారు. ఈ సంవత్సరంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. మాకు ఆ పది నియోజకవర్గాల్లో అనేకమంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
మాకు జైలు కానీ, ప్రభుత్వాల బెదిరింపులు కానీ, వేధింపులు కానీ కొత్త కాదు. గతంలో తెలంగాణ కోసం ఇవన్నీ ఎదుర్కొన్నాం. మా పైన విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు తమ ఉత్సాహాన్ని.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని ఎండగట్టడంలో ఉపయోగించండి. కాంగ్రెస్ పార్టీ చేసిన అమృత్ స్కాం.. బియ్యం స్కాం.. కాంగ్రెస్ నాయకుల పైన ఈడీ దాడులను ప్రశ్నించడంపైన చూపించండి. బీజేపీ – కాంగ్రెస్, ఈడీ – ఏసీబీ కలిసి కేసులు పెట్టుకున్న మేము ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు. ఎన్నికల అప్పుడు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకరినొకరు విమర్శించుకుంటారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను ఎత్తేయడం ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | 37 రోజులు కాదు.. దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. సీఎం రేవంత్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్