తాండూర్ : జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీసర్వే ( Land Resurvey ) ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి చంద్రయ్య ( Chandraiah ) అన్నారు. మండలంలోని ద్వారకాపూర్ గ్రామ పరిధిలో జరుగుతున్న రాంపూర్ గ్రామం రీసర్వే ప్రక్రియ పనులను పరిశీలించారు.
రికార్డుల ఆధారంగా రీ సర్వే సక్రమంగా జరగాలని, రైతుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగా సమాచారం అందించాలని సూచించారు. రైతులు భూ వివాదాలు ఏమైనా ఉంటే రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించి సరి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోత్స్న, సర్పంచ్ మాసాడి తిరుపతి, రీ సర్వే డీటీ, మండల సర్వేయర్, వీఆర్, గ్రామ సర్వేయర్, పలువురు రైతులు పాల్గొన్నారు.