మహబూబ్నగర్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు ( Better Service ) అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి (Collector Vijayendira Boi ) సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని( General Hospital ) ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో వివిధ మెడికల్ వార్డులను సందర్శించి, రోగులు , వైద్య అధికారులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత తదితర విషయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని. జనరల్ ఆసుపత్రిని రాష్ట్రం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని అధికారులను సూచించారు
. ఒకే పడకపై ఇద్దరు రోగులు ఉండటాన్ని గమనించి, వారికి ఎందుకు వేరు వేరు బెడ్లు ఇవ్వలేదని సిబ్బందిని ప్రశ్నించారు. ఐసీయూ విభాగాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. ఆర్థోపెడిక్ విభాగంలో రోజుకు ఎన్ని శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని ప్రశ్నించగా, రోజుకు 3 నుంచి 5 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు.
ఆసుపత్రి నిర్వాహణపై పలు సూచనలు చేశార. ఆమె వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, సీనియర్ వైద్యురాలు డాక్టర్ మాధవి, ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.