Banana Facemask | అరటి పండుతో ముఖానికి ఇలా మాస్క్ వేయండి.. ముఖం ప్రకాశిస్తుంది..
చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే అనేక సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి చాలా మంది అనేక చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు అరటిపండు మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Banana Facemask | చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే అనేక సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి చాలా మంది అనేక చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు అరటిపండు మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మాత్రమే తెలుసు. కానీ అరటిపండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. అరటిపండు మాస్క్ వేసుకోవడం వల్ల వృద్దాప్య సంకేతాలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో దోహదపడతాయి. మొటిమలతో బాధపడే వారు అరటిపండు మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వృద్ధాప్య లక్షణాలు దూరం..
ఇందులో ఉండే పొటాషియం చర్మాన్మి హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్దాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. అరటిపండు మాస్క్ వేసుకోవడం వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మంపై ముడతలు పోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. చర్మంపై ముడతలు, వృద్దాప్య లక్షణాలు, నల్లటి మచ్చలతో బాధపడే వారు అరటిపండుతో ఫేస్ మాస్క్ లను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు, పెరుగు..
చర్మంపై ముడతలు, వృద్దాప్య లక్షణాలతో బాధపడే వారు అరటిపండు, పెరుగు కలిపి మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే గీతలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం స్థితిస్థాపకతను పెంచడంలో ఈ మాస్క్ ఎంతో సహాయపడుతుంది. ఈ మాస్క్ ను తయారు చేసుకోవడానికి గాను సగం అరటిపండును మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాదా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉండాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, గీతలు తొలగిపోతాయి.
అరటి పండు, తేనె..
ఇక ముఖంపై నల్లటి మచ్చలతో బాధపడే వారు అరటిపండు, తేనె కలిపి మాస్క్ లాగా వేసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మేంటెషన్ కూడా తగ్గుతుంది. ఈ మాస్క్ ను తయారు చేసుకోవడానికి గాను బాగా పండిన సగం అరటిపండును తీసుకుని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి సహజ మెరుపు లభిస్తుంది. ఈ విధంగా చాలా తక్కువ ధరలో, చాలా సులభంగా, సహజ పద్దతిలో ముఖ అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

