KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి బయల్దేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీలు, పలువురు నాయకులు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. అంత్యక్రియల్లో పాల్గొని మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్ పేర్కొన్నారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది. వారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG TET 2024 | తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్..!
TG TET 2024 | ఎట్టకేలకు టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు విడుదల.. కానీ ఆ మూడు సెషన్లకు
MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ : ఎమ్మెల్సీ కవిత