TG TET – 2024 | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు సంబంధించిన హాల్ టికెట్లను టీజీ టెట్ కన్వీనర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లు అంటే సెషన్ – 1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్ -2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
-ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మ. 12.30 గంటల నుంచి అనుమతించనున్నారు.
-ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు. అంటే ఉదయం సెషన్లో ఉ. 8.45కు, మధ్యాహ్నం సెషన్లో 1.45 గంటలకు గేట్లను మూసివేయనున్నారు.
-అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు(ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ) తీసుకెళ్లాలి.
-స్మార్ట్ వాచీలతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి..
TG TET 2024 | ఎట్టకేలకు టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు విడుదల.. కానీ ఆ మూడు సెషన్లకు
MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ : ఎమ్మెల్సీ కవిత