MLC Kavitha | హైదరాబాద్ : 42 శాతం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే ఏడాది జనవరి 3 సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహిస్తాం అని కవిత పేర్కొన్నారు.
40 బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన డిమాండ్‌గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొంది. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారు..? జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తాం అని కవిత పేర్కొన్నారు.
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలి. అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏటా రూ. 20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పింది అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
BRS Party | మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరు కానున్న బీఆర్ఎస్ నేతలు
Govt Holidays | 2025లో ప్రభుత్వ సెలవులు ఇవే.. జనవరి 1న హాలీడే
Gram Panchayat | పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. రేవంత్ సర్కార్‌కు మాజీ సర్పంచ్ల డిమాండ్