Gram Panchayat | హైదరాబాద్ : పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్‌లంతా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడ్డ సర్పంచ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఏడాది కాలంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు కొంతమంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కొందరి సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇక మాజీ సర్పంచ్‌లను మభ్యపెట్టకుండా.. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు కేశబొయిన మల్లయ్య, గణేష్, నవీన్ కుమార్, పల్లె వెంకటేశం, సంఘం రాష్ట్ర నాయకులు ప్రణీత్ చంద్, బాషబోయిన ఉప్పలయ్య, లాగ్గాని రమేశ్, పూర్ణ చందర్ గౌడ్ రాష్ట్ర కమిటి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mulugu | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాలకు ఎస్పీ పరామర్శ
KTR | కేటీఆర్ మధ్యంతర బెయిల్ 31 వరకు పొడిగింపు