Mulugu | ములుగు : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య ఇళ్లను జిల్లా ఎస్పీ శబరీష్ శుక్రవారం సందర్శించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో బడే చొక్కారావు ఇంటికి వెళ్లి.. తల్లి బతుకమ్మకు నిత్యావసరాలు అందించారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో సాంబయ్య ఇంటికి కూడా వెళ్లారు ఎస్పీ. సాంబయ్య భార్య సుజాతకు నిత్యావసర సరుకులు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య అడవి వీడి జనంలోకి రావాలని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. చొక్కారావు, సాంబయ్యపై ఉన్న రివార్డులతో పాటు ఇండ్ల మంజూరుకు ములుగు ఎస్పీ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
Manmohan Singh | బంగారాన్ని తాకట్టు పెట్టి.. దేశ దిశను మార్చేసిన మన్మోహన్ సింగ్
KTR | కేటీఆర్ మధ్యంతర బెయిల్ 31 వరకు పొడిగింపు