MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు.
హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంతో తెలికుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని విమర్శించారు.
Live : Addressing the media https://t.co/wo6KhMRVVG
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 27, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

