KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Manmohan Singh | బంగారాన్ని తాకట్టు పెట్టి.. దేశ దిశను మార్చేసిన మన్మోహన్ సింగ్
Warangal | వరంగల్‌లో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం