BRS Party | మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరు కానున్న బీఆర్ఎస్ నేతలు
BRS Party | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది.
BRS Party | హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధుల బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది. వారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Govt Holidays | 2025లో ప్రభుత్వ సెలవులు ఇవే.. జనవరి 1న హాలీడే
Gram Panchayat | పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. రేవంత్ సర్కార్‌కు మాజీ సర్పంచ్ల డిమాండ్
KTR | కేటీఆర్‌ను 31 వరకు అరెస్టు చేయొద్దు.. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- KCR
- KTR
- Manmohan Singh
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

