RS Praveen Kumar | మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, మెదక్ ప్రమాదం.. ఈ రెండు సంఘటనల్లోనూ వేర్వేరు న్యాయాలు ఉండరాదని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఏ11 అయినప్పుడు.. రేవంత్ రెడ్డి కూడా ఏ 11 కావాలి కదా అని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ప్రశ్నించారు.
ఈ రెండు ఘటనల్లో ఇద్దరు ప్రముఖులే అని.. ఒకరు సినీ స్టార్ అల్లు అర్జున్ (AA), మరొకరు సీఎం రేవంత్ రెడ్డి (RR) అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్, మెదక్‌లో ఒక రోడ్డు.. రెండు కూడా ప్రజల కోసం ఉద్దేశించినవే అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్లో అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా చూడాలని దివంగత రేవతి తన కొడుకుతో బెనిఫిట్ షో కు వచ్చింది. బెనిఫిట్ షోకు పర్మిషన్ సీఎం /కోమటి రెడ్డి ఇచ్చారని చెప్పారు. మరోచోట సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని బహిరంగ ప్రదేశంలో ఇద్దరు యువకులు ఫ్లెక్సీ కడుతున్నారని.. వారికి పర్మిషన్ లేదని అన్నారు. విద్యుత్ షాక్ వల్ల ప్రమాదవశాత్తూ చనిపోయారని చెప్పారు.
ఈ రెండు సంఘటనల్లో కథానాయకులకు వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం ఉండి ఉండదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సెక్షన్ 105 BNS =Culpable Homicide Not Amounting to Murder.. అంటే జాగ్రత్తలు తీసుకోనందు వల్ల జరిగిన మరణం.. ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు అని పేర్కొన్నారు. Vicarious Liability Principle కింద AA ను ఈ కేసులో A11 గా పెట్టినట్టు తెలుస్తోంది. Actual గా అయితే ఇది ముమ్మాటికీ స్థానిక పోలీసు వైఫల్యమే అని పేర్కొన్నారు. కానీ పోలీసులు తమకు తామే నిందితులుగా FIR లో పేర్లు చేర్చుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సూత్రం ప్రకారం మెదక్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిందితులవుతారని పేర్కొన్నారు. వాళ్ల పాత్ర ఎంతనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందని చెప్పారు.
రేవతి = నవీన్ & ప్రశాంత్; అల్లు అర్జున్ =రేవంత్ రెడ్డి; సంధ్య థియేటర్ = మెదక్ లో రోడ్డు.. AA A11 అయినప్పుడు RR కూడా A11 కావాలె కదా అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు.