అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకుడు. వెంకట్ యాదవ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మనసుల్ని తాకే ఈ సినిమాలోని ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘మంగళస్నానం..’ అంటూ సాగే ఈ పాటను ఎస్.ఎస్.చిరంజన్ రాయగా, చరణ్ అర్జున్ స్వరపరిచారు. యోగి సురేష్, విహా కలిసి ఆలపించారు.
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ పాట సాగుతుంది. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పించే సినిమా ఇదని దర్శక, నిర్మాతలు తెలిపారు. గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్, నిర్మాణం: రుద్రక్రాంతి పిక్చర్స్.