KTR | హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
1996లో మందా జగన్నాథం తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్‌పై విజయం సాధించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. వారానికి రెండుసార్లు అనుమతి..
KT Rama Rao: 3D వ్యూహాంలో రేవంత్ రెడ్డి సర్కార్: కేటీఆర్
MLC Kavitha | రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదు.. ఎమ్మెల్సీ కవిత ఫైర్