TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు సీఎం గ్రీన్ సిగ్నల్.. వారానికి రెండుసార్లు అనుమతి..
TTD | ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించడం లేదనే విమర్శలు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై సిఫారసు లేఖల అంశంపై సోమవారం చర్చించారు.
TTD | ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించడం లేదనే విమర్శలు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై సిఫారసు లేఖల అంశంపై సోమవారం చర్చించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సీఎం అంగీకరించారు. వారానికి రెండుసార్లు రూ.300 దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. వాస్తవానికి తెలంగాణ నుంచి తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, గత కొద్దిరోజుల కిందట టీటీడీ ఈవో శ్యామల రావు శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, విషయంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ పాలకమండలి సమావేశంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై చర్చించారు. బోర్డు సభ్యులు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పాలకమండలి నిర్ణయం మేరకు బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖలకు సీఎం ఆమోదం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

